గంజాయి పట్టివేత - నిందితుల అరెస్ట్
NEWS Aug 31,2024 11:13 am
కాగజ్నగర్ మండలం ఈస్గాం పోలీస్ స్టేషన్ పరిధిలో టాస్క్ఫోర్స్ అధికారులకు అందిన సమాచారం మేరకు రాజ్ కుమార్ ఇంట్లో సోదాలు చేయగా 55 గ్రాముల గంజాయి లభ్యమైనట్లు ఎస్సై రమణకుమార్ తెలిపారు. చింతగూడ, బురదగుడా గ్రామాల్లో నివాసముండే విద్యార్థులు, ఇతర యువకులకు గంజాయిని మహారాష్ట్ర నుంచి తీసుకువచ్చి చిన్నచిన్న ప్యాకెట్లుగా తయారుచేసి అమ్ముతుండగా ఐదుగురిని అరెస్టు చేసి, ఆరుగురిపై కేసు నమోదు చేశామన్నారు.