సింగరేణి వర్కర్లకు శుభవార్త
NEWS Aug 31,2024 11:23 am
సింగరేణి సంస్థలో పనిచేస్తున్న 2364 మంది బదిలీ వర్కర్లను జనరల్ మజ్దార్లుగా క్రమబద్ధీకరిస్తున్నట్లు సంస్థ చైర్మన్ అండ్ ఎండీ ఎన్.బలరామ్ తెలిపారు. సంస్థలో చేరినప్పటి నుంచి ఏడాదిలో భూగర్భ గనుల్లో 190 రోజులు, ఉపరితల గనుల్లో 240 రోజులు విధులు నిర్వహించిన వారిని రెగ్యులరైజ్ చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు త్వరలోనే ఉత్తర్వులు జారీ చేయాల్సిందిగా డైరెక్టర్ (పర్సనల్)కు ఆదేశాలు జారీ చేశారు.