ఆలయాల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు పటేల్ అన్నారు. నిర్మల్ జిల్లా దస్తురాబాద్ మండలంలోని దేవునిగూడెం గ్రామంలో రూ.9.50 లక్షల నిధులతో నూతనంగా నిర్మిస్తున్న నల్ల పోచమ్మ ఆలయ నిర్మాణ పనులను భూమి పూజ చేసి ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మండల ప్రజా ప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.