అస్వస్థతకు గురైన విద్యార్ధినులు
NEWS Sep 03,2024 07:03 am
డుంబ్రిగూడ మండలం జామగూడ బాలికల ఆశ్రమ పాఠశాలలో పుడ్ పాయిజన్ తో 61 మంది విద్యార్ధినులు అస్వస్థతకు గురయ్యారు. వీరిని అరకు ఏరీయా ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న సిఐ హిమగిరి హుటాహుటిన ఆశ్రమ పాఠశాలకు చేరుకున్నారు. సిఐ తన వాహనంలో కొంత మంది విద్యార్ధినిలను అరకు ఏరియా ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఏరియా ఆసుపత్రికి చేరుకున్న DM&HO, గిరిజన సంక్షేమ శాఖ DD కొండలరావు లతో విద్యార్ధినుల ఆరోగ్య పరిస్ధితిని పరిశీలించారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాలి.