హైదరాబాద్‌లో రాబర్ట్ వాద్రా పర్యటన
NEWS Aug 30,2024 05:43 pm
HYD: ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రా శుక్రవారం హైదరాబాద్‌లో పర్యటించారు. ఆయన జూబ్లీహిల్స్ పెద్దమ్మతల్లిని దర్శించుకున్నారు. మీడియాతో మాట్లాడుతూ... ఆధ్యాత్మిక భావనలతోనే హైదరాబాద్ వచ్చినట్లు చెప్పారు. రాజకీయ కోణం లేదన్నారు. దేశంలో మహిళల భద్రత పెద్ద సమస్యగా మారిందన్నారు. తన భార్య, కూతురు భద్రతపై కూడా ఆందోళనగా ఉందన్నారు. తన భార్య ప్రియాంక గాంధీ వయనాడ్ నుంచి పోటీ చేయనుందని, ఆమెకు శుభాకాంక్షలు చెబుతున్నానని తెలిపారు.