LRS దరఖాస్తుల పరిశీలన పకడ్బందీగా చేపట్టాలి
NEWS Sep 02,2024 06:13 pm
ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిశీలన ప్రక్రియను పకడ్బందీగా చేపట్టాలని జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల ప్రక్రియపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ..ప్రభుత్వ నిబంధన మేరకు ఎల్ ఆర్ ఎస్ ప్రక్రియను నిర్వహించాలని సూచించారు.