31న సామాజిక పింఛన్లు పంపిణీ
NEWS Aug 30,2024 05:46 pm
అరకులోయ మండల పరిదిలో ఉన్న 6537 సామాజిక ఫించన్ల కు రూ.2,79,70,500/- లు మంజూరైనట్లు ఎంపీడీఓ వెంకటేష్ తెలిపారు. ఒక్కొ సచివాలయ ఉద్యోగి 50 ఫించన్లు పంపిణీ చేయాలని ఎంపీడీఓ అన్నారు. ఈ నెల 31 తేదీన సామాజిక పింఛన్లను పంపిణీ జరగుతాయని పేర్కొన్నారు. 31వ తేదిన పింఛను తీసుకోని లబ్ధిదారులు సెప్టెంబరు 2వ తేదీన తీసుకోవచ్చని అన్నారు. ఫించను పంపిణీ ఉదయం 6 గంటల నుండి ప్రారంభించాలని సూచించారు.