మొక్కలు నాటడాన్ని సామాజిక భాద్యతగా స్వీకరిచాలి: సిఐ హిమగిరి
NEWS Aug 30,2024 03:02 pm
అల్లూరి జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు అరకులోయ సర్కిల్ ఇనస్పెక్టర్ ఆఫీసులో సిఐ హిమగిరి ఆధ్వర్యంలో వనం మనం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐ కార్యాలయంలో సిఐ హిమగిరి, ఏఎస్సై శ్రీనువాసరావు మొక్కలు నాటారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటడాన్ని సామాజిక భాద్యతగా స్వీకరించాలని సిఐ సూచించారు. కార్యక్రమంలో కానిస్టేబుల్స్ రామూర్తి, బిరుసు, కమల మరియు ఏపిఎస్పి సిబ్బంది పాల్గొన్నారు.