బీఆర్ఎస్ పార్టీలోకి మాజీ ఎంపీటీసీ
NEWS Aug 30,2024 02:57 pm
బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ నివాసంలో కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీటీసీ షేక్ జాహెద్ బీఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా వారికి ఎమ్మెల్యే అనిల్ జాదవ్ బీఆర్ఎస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ కృష్ణ రెడ్డి, ఎంపీపీ ప్రీతం రెడ్డి, ఎంపీటీసీ శివారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.