ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని దర్శించుకోవడానికి శుక్రవారం రాష్ట్ర నలుమూల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. అయితే ఈరోజు ఉదయం ఒక్కసారిగా వర్షం కురవడంతో వర్షాన్ని సైతం లెక్కచేయకుండా భక్తులు స్వామి వారి దర్శనానికి బారులు తీరారు. భక్తులు వర్షంలోనే తడుస్తూ ఓం నమశ్శివాయ అంటూ స్వామివారి నామస్మరణతో భక్తి పరవశ్యం చెందారు.