సైబర్ నేరాల పట్ల జాగ్రత్తగా ఉండాలి
NEWS Aug 30,2024 03:04 pm
సైబర్ నేరాల పట్ల ప్రజలు, విద్యార్థులు, యువత పూర్తిగా అవగాహన కలిగి ఉండి, తగు జాగ్రత్తలు తీసుకోవాలని బాసర ట్రిపుల్ ఐటీ ఎస్ఐ పుష్పవతి అన్నారు. ముధోల్ మండల కేంద్రంలోని ఓ పాఠశాలలో సైబర్ క్రైమ్ పై అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజలు తమ వ్యక్తిగత, బ్యాంకింగ్ వివరాలు అపరిచితులతో పంచుకోవద్దని సూచించారు. ఫోన్లలో ఓటీపీ, మెసేజ్లకు స్పందించకూడదని తెలిపారు.అదేవిధంగా తమ ఫోన్ లకు వచ్చే అపరిచిత లింక్ లను ఓపెన్ చెయ్యవద్దన్నారు.