ఘనంగా వన మహోత్సవ కార్యక్రమం
NEWS Aug 30,2024 05:45 pm
అమలాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో వనమహోత్సవ కార్యక్రమం శుక్రవారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో అమలాపురం ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు, పార్లమెంట్ సభ్యులు గంటి హరీష్ మాధుర్, జిల్లా కలెక్టర్ రావిరాల మహేష్ కుమార్, జాయింట్ కలెక్టర్ నిశాంతి, మున్సిపల్ చైర్ పర్సన్ రెడ్డి సత్య నాగేంద్రమణి, మున్సిపల్ కౌన్సిల్ సభ్యులు పాల్గొన్నారు.