పరిశ్రమల్లో జరుగుతున్న ప్రమాదాల నివారణకు జిల్లా స్థాయి భద్రత పర్యవేక్షణ కమిటీ సభ్యులు చురుకైన పాత్ర పోషించే క్రమంలో క్షేత్ర స్థాయిలో కార్యాచరణకు సిద్ధం కావాలని తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి ఆదేశించారు. రాజమండ్రి కలెక్టరేట్లో పరిశ్రమల భద్రతపై సమన్వయ శాఖల అధికారులు తో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. పరిశ్రమల్లో ప్రమాదాల నివారణకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు.