విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టిన ఆయిల్ ట్యాంకర్
NEWS Aug 27,2024 06:07 pm
అల్లవరం మండలం సమనస గ్రామం లో ప్రధాన రహదారిపై ఉన్న విద్యుత్ స్తంభాన్ని మంగళవారం ఓ ఆయిల్ ట్యాంకర్ ఢీకొట్టింది. ఉప్పలగుప్తం మండలం ఎస్.యానాం వైపు వెళ్తున్న ట్యాంకర్ అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టడంతో అది పక్కకు వంగిపోయింది. విద్యుత్ శాఖ అధికారులు సంఘటన స్థలానికి చేరుకుని వెంటనే కొత్త స్తంభం ఏర్పాటు చేశారు.