విద్యార్ధినులకు ఆత్మరక్షణపై మెలకువులు
NEWS Aug 27,2024 06:08 pm
అరకులోయ ప్రభుత్వ మహిళ డిగ్రీ కళాశాలలో విద్యార్ధినిల కొరకు ఫిట్ ఇండియా ప్రోగ్రాం నిర్వహించారు. ఈ మేరకు కుంగ్ ఫూ మాష్టారు కె అప్పారావు చేత విద్యార్ధినులకు శారీరక దృఢత్వం, ఆత్మరక్షణల పై మెలుకువులను నేర్పించారు. మహిళలపై జరుగుతున్న దాడులను అడ్డుకునేందుకు ప్రతి విద్యార్థిని ఆత్మరక్షణ మెలుకువలను సాధన ద్వారా నేర్చుకోవాల్సిన అవసరం ఉందని ప్రిన్సిపాల్ డా రామకృష్ణ, వైస్ ప్రిన్సిపాల్ చలపతిరావు అన్నారు.