ఆయిల్ ఫామ్ సాగుపై రైతులు దృష్టి సారించాలి: బండారు
NEWS Aug 27,2024 06:09 pm
తక్కువ పెట్టుబడితో దీర్ఘకాలికంగా ఎక్కువ లాభాలు అందించే ఆయిల్ ఫామ్ సాగుపై రైతులు దృష్టి సారించాలని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు రైతులకు పిలుపునిచ్చారు. ఆత్రేయపురం మండలం అంకంపాలెంలో ఆంధ్రప్రదేశ్ ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో ఆయిల్ ఫామ్ సాగుపై రైతులకు అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని ఆయిల్ ఫామ్ వల్ల వచ్చే లాభాలను రైతులకు వివరించారు.