రేషన్ డీలర్ల సమస్యలు పరిష్కరించాలని వినతి
NEWS Aug 27,2024 06:07 pm
తూర్పుగోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన ఎస్. చిన్నరాయుడిని మంగళవారం జిల్లా రేషన్ డీలర్ల సంఘ నాయకులు బి.రాజు ఆధ్వర్యంలో మర్యాదపూర్వకంగా కలిశారు. డీలర్లు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు. ముఖ్యంగా షాపుల బైపర్కేసన్ వల్ల డీలర్లు ఆర్థికంగా నష్టపోతున్నారని, డీలర్లకు ఆదాయం పెంచే దిశగా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాజమండ్రి డివిజన్లోని రేషన్ డీలర్లు పాల్గొన్నారు.