ఉచిత వృత్తి విద్య శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానం
NEWS Aug 27,2024 06:07 pm
19సంవత్సరాల నుండి 35 సంవత్సరాల లోపు యువకులకు ఉపాధి కల్పించే నిమిత్తం బ్యాంకర్ల గ్రామీణ ఔత్సాహికుల అభివృద్ధి సంస్థ హైదరాబాద్ వారిచే శ్రీ సత్య సాయి సేవా సంస్థల ఆధ్వర్యంలో మంగళగిరి పట్టణంలో ఉచిత వృత్తి విద్య శిక్షణా శిబిరాన్ని ఈ సంవత్సరం అక్టోబర్ మూడో తేదీ నుండి ప్రారంభిస్తున్నట్లుగా శ్రీ సత్య సాయి సేవా సంస్థలు ప్రతినిధులు మీడియా సమావేశంలో తెలిపారు. వివరాలకు 8008578017కు సంపాదించాలని కోరారు.