విలీనం ఒక్కటే మిగిలిది: మహేశ్ గౌడ్
NEWS Aug 27,2024 11:00 am
కవితకు బెయిల్ వస్తుందన్న విషయం ఊహించిందేనని MLC మహేశ్ గౌడ్ అన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ కుమ్మక్కుతోనే కవితకు బెయిల్ వచ్చిందన్నారు. బీజేపీ నేతల ఇళ్ల చుట్టూ తిరిగి, కాళ్ల మీద పడి కవితకు బెయిల్ తెచ్చుకున్నారని ఎద్దేవా చేశారు. బీజేపీ, బీఆర్ఎస్ కుమ్మక్కు రాజకీయాలు బయటపడ్డాయని, తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలని, ఇక బీజేపీలో బీఆర్ఎస్ విలీనం ఒక్కటే మిగిలిందని అన్నారు.