ముగ్గురి మృతదేహాలు వెలికితీత
NEWS Aug 27,2024 10:51 am
ఆదిలాబాద్ రూరల్ మండలం పొచ్చర వాగులో చేపల వేటకు వెళ్లి గల్లంతై ముగ్గురు మృతి చెందిన విషాద ఘటన చోటుచేసుకుంది. మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాకు చెందిన అక్షయ్, ఆకాష్, విజయ్ తాంసి మండలంలోని బండల్ నాగపూర్ లోని తమ బంధువు శ్రీనివాస్ ఇంటికి వచ్చారు. ఐతే సరదాగా మంగళవారం చేపల వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు వాగులో గల్లంతు కాగా, గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టి, ముగ్గురు యువకుల మృతదేహాలు పోలీసులు వెలికితీశారు.