అగ్ని వీర్ అభ్యర్థులకు ఉచిత వసతి
NEWS Aug 27,2024 10:26 am
అగ్ని వీర్ నియామక ప్రక్రియలో భాగంగా విశాఖపట్నం పోర్ట్ స్టేడియంలో ఆగస్టు 26 నుండి సెప్టెంబర్ 05 వరకు జరిగే ఆర్మీ ర్యాలీలో పాల్గొన్న వారు ఎవరైనా ఏజెన్సీ ప్రాంతాల నుండి వచ్చినవారు అరకు, పాడేరు, రంపచోడవరం నుండి ఎవరైనా విశాఖపట్నం వచ్చిన వారికి అరకు మాజీ పార్లమెంట్ సభ్యురాలు గొడ్డేటి మాధవి వసతి ఏర్పాటు చేయడం జరుగుతుందని ఆమె కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. వివరాలకు 8466007978, నెంబర్ లో సంప్రదించాలని కోరింది.