ఉచిత కంటి వైద్య శిబిరం
NEWS Aug 27,2024 10:25 am
అల్లూరి జిల్లా డుంబ్రిగూడ మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రి వైద్యులు గిరిజనులకు ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ శిబిరానికి ఆయా గ్రామాల నుంచి 171 మంది గిరిజనులు హాజరయ్యారని, 36 మందికి కంటి శుక్లాం శాస్త్ర చికిత్స, 39 మందికి కళ్ళజోడులు, 21 మందికి ఇతర సమస్యలు ఉన్నట్లు వైద్యులు తెలిపారు. హెచ్.ఆర్.సి రాష్ట్ర అధ్యక్షులు కృష్ణ కుమారి పాల్గొన్నారు.