బండి సంజయ్ ట్విట్ - కేటీఆర్ ఫైర్
NEWS Aug 27,2024 10:05 am
కవితకు బెయిల్ మంజూరు చేయడంపై కేంద్రమంత్రి బండి సంజయ్ కాంగ్రెస్ కి, ఆ పార్టీ న్యాయవాదులకు అభినందనలు అంటూ ట్వీట్ చేశారు. బండి ట్వీట్‌ను KTR తప్పుబట్టారు. ఆయన కేంద్ర హోంశాఖ వ్యవహారాల ఇంఛార్జ్‌గా ఉన్నారని, సుప్రీంకోర్టు తీర్పుపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారని X వేదికగా కేటీఆర్ అన్నారు. మీ స్థాయికి ఇది తగిన వైఖరి కాదని బండి సంజయ్‌ని అన్నారు. ప్రధాన న్యాయమూర్తి, సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలను కోర్టు ధిక్కార చర్యగా భావించి అందుకు అనుగుణంగా చర్యలను తీసుకోవాలన్నారు.