కవ్వాల్ టైగర్ జోన్లో పెద్దపులి సంచారం
NEWS Aug 27,2024 10:04 am
కవ్వాల్ పులుల రక్షణ కేంద్రం పరిధిలోని అల్లినగర్, దొంగపల్లి, తదితరల గ్రామాల్లో అటవీ శాఖ అధికారులు దండోరా వేయించారు. జన్నారం అటవీ రేంజ్లో పెద్దపులి సంచరిస్తుందని ప్రజలెవరూ అడవిలోకి వెల్లకూడదని అటవీ బీట్ అధికారి భోజనాయక్ సూచించారు. ప్రజలెవరూ అత్యుత్సాహం ప్రదర్శించి ఉచ్చులు, కరెంటు తీగలు అమర్చవద్దని హెచ్చరించారు. ఎవరికైనా పులికనబడితే వెంటనే అటవీ అధికారులకు సమాచారం అందించాలని కోరారు.