మంత్రి దృష్టికి సమస్యలు తీసుకువెళ్లిన MLA
NEWS Aug 27,2024 10:52 am
విజయవాడ క్యాంపు కార్యాలయంలో జలవనరుల శాఖా మంత్రి నిమ్మల రామానాయుడును మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నియోజకవర్గ సమస్యలను మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. దీనిపై మంత్రి సానుకూలంగా స్పందించి వాటి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చినట్లు ఎమ్మెల్యే వేగుళ్ల తెలిపారు.