ఏలేశ్వరం ఫుడ్ పాయిజన్ ఘటనపై స్పందించిన లోకేశ్
NEWS Aug 27,2024 06:10 pm
కాకినాడ జిల్లా ఏలేశ్వరం బాలికల గురుకుల పాఠశాలలో కలుషిత ఆహారం తిని విద్యార్థినులు అస్వస్థతకు గురైన ఘటన ఆందోళనకు గురి చేసిందని విద్య శాఖ మంత్రి లోకేశ్ ‘X’లో ట్విట్ చేశారు. విద్యార్థినులకు మెరుగైన చికిత్స అందించాల్సిందిగా విద్య, వైద్య శాఖల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నట్లు పేర్కొన్నారు.