గోకవరం పోలీస్ స్టేషన్‌ను సందర్శించిన సీఐ
NEWS Aug 25,2024 03:02 pm
కోరుకొండ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ సత్య కిషోర్ ఆదివారం ఉదయం గోకవరం పోలీస్ స్టేషన్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్థానిక రౌడీషీటర్లతో సమావేశమై వారి విధానాలను తెలుసుకున్నామని, సత్ప్రవర్తన కలిగిన రౌడీషీటర్ల పై కేసులను తొలగిస్తున్నామని తెలిపారు. అదేవిధంగా రెండు రోజుల క్రితం దొరికిన గంజాయి ముద్దాయిల కోసం గాలిస్తున్నామని త్వరలోనే వారిపై కేసు నమోదు చేసి కోర్టుకు తరలిస్తామని చెప్పారు.