కవిత ఇష్యూ టీ కప్పులో తుపాను లాంటిది
NEWS Jun 01,2025 06:29 pm
తాజాగా బీఆర్ఎస్ లో చోటు చేసుకున్న కవిత వివాదంపై స్పందించారు మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య. ఆమె ఎక్కడికీ వెళ్లదని, తాను సిసలైన తెలంగాణ బిడ్డ అని పేర్కొన్నారు. ఇప్పటికే కేసీఆర్ తనకు దేవుడు అని చెప్పిందన్నారు. మొదటి నుంచి జాగృతికి కవిత రాష్ట్ర అధ్యక్షురాలిగా ఉన్నారని చెప్పారు. ఆమె వల్ల పార్టీకి బలం చేకూరుతుందే తప్పా నష్టం జరగదన్నారు. తమ పార్టీలో ప్రతి ఒక్కరికీ చెప్పుకునే స్వేచ్ఛ ఉంటుందన్నారు