అన్నవరంలో వైభవంగా రథ మహోత్సవం
NEWS Aug 25,2024 03:00 pm
అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానంలో ప్రతి ఆదివారం నిర్వహించే శ్రీ స్వామి అమ్మవార్ల రథ సేవ మహోత్సవాన్ని నేడు ఉదయం వైభవంగా నిర్వహించారు. మంగళ వాయిద్యాలు, అర్చక స్వాముల వేదమంత్రాల నడుమ భక్తులు రథం లాగుతూ రథ సేవ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. పరిసర ప్రాంతాల భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.