అల్లూరి జిల్లా కేంద్రం పాడేరు జిల్లా ఆస్పత్రిలో వైరల్ జ్వరాలతో విద్యార్థులు చేరుతున్నారు. పాడేరు గిరిజన సంక్షేమ బాలుర పాఠశాల నుంచి రెండు రోజులుగా సుమారు 50 మంది వైరల్ బారిన పడ్డారు. సిక్ అయిన వారిని నిర్వాహకులు ఆసుపత్రికి తరలిస్తున్నారు. వాతావరణ మార్పుల వల్ల విష జ్వరాలు పెరుగుతున్నాయని వేడి నీళ్లు తాగాలని వైద్యులు చెప్తున్నారు.