హైదరాబాద్‌లో భారీ వర్షం కురుస్తోంది. సాయంత్రం వరకు ప్రశాంతంగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా మేఘావృతమై.. కుండపోతగా వర్షం కుమ్మరిస్తోంది. నగరంలోని చాలా ప్రాంతాల్లో అతి భారీ వర్షం పడుతోంది. దీంతో రహదారులన్ని ఒక్కసారిగా జలమయం అయ్యాయి.ట్రాఫిక్ ఎక్కడికక్కడ ఆగిపోయింది. ఉరుములు మెరుపులతో పాటు భారీ ఈదురు గాలులతో.. వరుణుడు ఉగ్రరూపం ప్రదర్శిస్తున్నాడు.