వందల ఏళ్ల పోరాట బలం
తెల్లవారి గుండెల్లో దిగిన బల్లెం
లక్ష్య సాధన కోసం..
ప్రాణాలు వదిలిన నాయకులు
జైలంటే.. జడవని లక్షల జనం.
నిత్యం.. జపించిన జపం
స్వాతంత్య్ర నినాదం.
సూర్యోదయం ఎరుగని
ఆంగ్లేయ మహా సామ్రాజ్యం..
వీరుల పోరాటానికి బెడిసి
మన దేశభక్తికి సలాం కొట్టి..
స్వేచ్చను ప్రసాదించి
భారత మాత సంకెళ్ళు తెంచి
స్వాతంత్య్రం ప్రకటించి..
దేశం.. విడిచి పారి పోయిన
క్షణం.. మహత్తరం.. మాహోత్తరం