పారిస్ ఒలింపిక్స్ మహిళల రెజ్లింగ్ 50 కిలోల కేటగిరీలో అనర్హత వేటుకు గురైన భారత రెజ్లర్ వినేశ్ ఫోగాట్‌కు తీవ్ర నిరాశ ఎదురైంది. వినేశ్ ఫోగాట్ దాఖలు చేసిన పిటిషన్ ను CAS కొట్టివేసింది. వినేశ్ పారిస్ రెజ్లింగ్ 50 కిలోల కేటగిరీలో నిర్దేశిత బరువు కంటే 100 గ్రాములు ఎక్కువ బరువు ఉందన్న కారణంతో ఆమెను ఫైనల్ కు అనర్హురాలిగా ప్రకటించారు. ఈ కేసులో వినేశ్ ఫోగాట్ కు అనుకూలంగా తీర్పు వచ్చి ఉంటే, ఆమెకు రజత పతకం దక్కేది.