బీజేపీ జాతీయ మహిళా అధ్యక్షురాలు వనతి శ్రీనివాసన్ ఆదేశాల మేరకు బీజేపీ జిల్లా మహిళా మోర్చా ఆధ్వర్యంలో స్వాతంత్య్ర సమరయోధుల వారసులను ఘనంగా సన్మానించారు. స్వాతంత్య్ర సమరయోధులు ఆకులు జోగయ్య మనవరాలు అమలాపురం మాజీ మున్సిపల్ చైర్మన్ కల్వకొలను ఛాయాదేవిని శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆర్వీ నాయుడు, చిట్టూరి రాజేశ్వరి, చిలకమర్రి కస్తూరి, మోకా ఆదిలక్ష్మి, దొంగ భవాని పాల్గొన్నారు.