బీసీలకు అన్యాయం చేస్తే ఆమరణ దీక్ష
- మేకపోతుల నరేందర్ గౌడ్
NEWS Aug 13,2024 01:40 pm
కామారెడ్డిలో కాంగ్రెస్ ఇచ్చిన బీసీ డిక్లరేషన్ హామీ మేరకు తక్షణమే సమగ్ర కులగణన చేసి, స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు మేక -పోతుల నరేందర్ గౌడ్ డిమాండ్ చేశారు. సమగ్ర కులగణన, స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వే షన్లు లేకుండా స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ ప్రకటిస్తే ఆ రోజు నుండే ఆమరణ నిరాహార దీక్ష చేస్తామని తెలిపారు. బీసీ సంఘాలన్నింటినీ కలుపుకొని రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని హెచ్చరించారు.