భారత స్టాక్ మార్కెట్ వృద్ధిపై రాహుల్ గాంధీ అనుమానాలు వ్యక్తం చేశారు. మోదీ 3.0 వచ్చాక ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. అయితే ఇదే కాలంలో స్టాక్ మార్కెట్‌లోని తన పెట్టుబడుల ద్వారా రాహుల్ రూ.46.49 లక్షల ఆదాయాన్ని ఆర్జించినట్లు డేటా వెల్లడిస్తోంది. 2024 మార్చి 15 నాటికి రాహుల్ స్టాక్స్ విలువ రూ.4.33 కోట్లు ఆగస్ట్ 12 నాటికి ర4.80 కోట్లకు పెరిగింది. NDA ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన త ర్వాత స్టాక్ మార్కెట్ భారీ లాభాలను చూస్తోంది.