గల్ఫ్ సంక్షేమంపై ప్రభుత్వం సమాలోచన
NEWS Aug 12,2024 06:28 pm
హైదరాబాద్: గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం తక్షణం తీసుకోవలసిన చర్యల గురించి సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో సచివాలయంలో సమాలోచన సమావేశం జరిగింది. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి చొరవతో జరిగిన ఈ సమాలోచనలో మంత్రి పొన్నం ప్రభాకర్, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్, టీపీసీసీ ఎన్నారై సెల్ చైర్మన్ వినోద్ కుమార్, టీపీసీసీ ఎన్నారై సెల్ కన్వీనర్ మంద భీంరెడ్డి కార్యాచరణ గురించి చర్చించారు.