తెలంగాణ కాంగ్రెసుకు కొత్త చీఫ్.!
హైకమాండ్ రేపు నిర్ణయించే అవకాశం..
NEWS Aug 12,2024 01:27 pm
HYD: ఆయా రాష్ట్రాల్లో పార్టీ ప్రక్షాళన దిశగా AICC మంగళవారం ఢిల్లీలో కీలక సమావేశం నిర్వహించనుంది. 8 రాష్ట్రాల్లో పీసీసీ చీఫ్ లను మార్చాలని హైకమాండ్ నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ కాంగ్రెసుకు కూడా కొత్త బాస్ ను ప్రకటించే అవకాశం ఉంది. దేశవ్యాప్తంగా పార్టీ బలోపేతంపై చర్చించడంతో పాటు పార్లమెంట్ ఎన్నికల్లో ఎక్కడెక్కడ పొరపాట్లు జరిగాయో ఈ సమావేశంలో సమీక్షించనున్నారు.