మల్లాపూర్: శ్రీ కనకసోమేశ్వర స్వామి గుట్టపైన శ్రావణ మాస వేడుకలు ఘనంగా జరుగుతు న్నాయి. శ్రావణమాసంలోని రెండవ సోమవారం భక్తులు అధిక సంఖ్యలో గుట్టపైకి చేరుకొని, కోనేటిలో స్నానం ఆచరించి, ఆలయంలో నైవేద్యం, వరదపాశం మొక్కులు తీర్చుకుంటున్నారు. మరోవైపు గుట్ట కింద అన్నదానం కార్యక్రమం కొనసాగుతోంది. మల్లాపూర్ మండలంలోని పలు గ్రామాల నుంచి వచ్చిన భక్తులతో సోమేశ్వర పుణ్యక్షేత్రం ప్రాంతం సందడిగా ఉంది.