నాగార్జున సాగర్ కు తగ్గిన వరద
ప్రాజెక్ట్ 26 గేట్లు మూసివేసిన అధికారులు
NEWS Aug 12,2024 11:15 am
నల్గొండ: నాగార్జున సాగర్ జలాశయానికి ఎగువ నుంచి వచ్చే వరద తగ్గుముఖం పట్టడంతో.. ప్రాజెక్టు 26 క్రస్ట్ గేట్లను అధికారులు మూసేశారు. దీంతో.. సాగర్ అందాలను తిలకించేందుకు వచ్చిన పర్యాటకులు నిరాశతో వెనుదిరిగారు సాగర్ ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 40,854 క్యూసెక్కులుగా ఉంది. నాగార్జున సాగర్ గరిష్టస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా.. ప్రస్తుతం ప్రాజెక్టులో 588.45 అడుగుల మేర నీరు ఉంది.