సీనియర్ నటుడు గిరిబాబు కన్నుమూత
NEWS Nov 14,2026 04:55 pm
సీనియర్ నటుడు గిరిబాబు (80) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. 1946 జూన్ 8న ప్రకాశం జిల్లాలో జన్మించిన ఆయన అసలు పేరు యెర్రా శేషగిరిరావు. 1973లో విడుదలైన ‘జగమే మాయ’ చిత్రంతో సినీరంగ ప్రవేశం చేశారు. 600 కు పైగా సినిమాల్లో నటించారు. తొలుత హీరోగా పరిచయమైన ఆయన, ఆ తర్వాత విలన్‌గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. హాస్య, కుటుంబ కథా చిత్రాల్లోనూ విభిన్న పాత్రలతో ప్రేక్షకులను అలరించారు. ‘కురుక్షేత్రం’, ‘కరుణామయుడు’ చిత్రాలు ఆయన కెరీర్‌లో ప్రత్యేకంగా నిలిచాయి.