కోరుట్ల: ఎస్‌ఆర్‌ఎస్‌పీ క్యాంప్ గడి ప్రాథమిక పాఠశాలలో ముందస్తు బాలల దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులే ఉపాధ్యాయులుగా మారి తరగతులు నిర్వహించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. బాలల దినోత్సవ ప్రాముఖ్యతను ప్రధానోపాధ్యాయుడు నునావత్ రాజు వివరించారు. ఉపాధ్యాయులు అబ్దుల్ రహూఫ్, పూర్ణచందర్, ధనలక్ష్మి, సుమలత, సరస్వతి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.