విద్యార్థుల అభ్యున్నతికి కృషి చేస్తా
NEWS Nov 10,2026 09:40 pm
జగిత్యాల: లక్ష్మీపూర్ ఎంపీపీఎస్ విద్యార్థులు ఆంగ్ల పదాలు, వాక్యాలను అనర్గళంగా చదవడం ఎంతో ఆనందంగా ఉందని ఉపాధ్యాయురాలు స్వప్న సుధ తెలిపారు. నిరంతర సాధనతో విద్యార్థుల్లో ఆంగ్ల పఠన నైపుణ్యాలు పెంపొందించామని, డీఈఓ కే. రాము ప్రశంసలు అందించడం మరింత ప్రోత్సాహాన్నిచ్చిందన్నారు. భవిష్యత్తులోనూ విద్యార్థుల అభ్యున్నతికి కృషి చేస్తానని పేర్కొన్నారు.