జలసిరి పనులు, అంగన్వాడీ కేంద్రం తనిఖీ
NEWS Nov 10,2026 09:28 pm
జగిత్యాల: మండలంలోని వెల్దుర్తి గ్రామపంచాయతీ పరిధిలో ఎంపీడీవో రమాదేవి పర్యటించారు. గ్రామంలో జరుగుతున్న జలసిరి పనులను, అంగన్వాడీ కేంద్రాన్ని తనిఖీ చేసి నిర్వహణ, పనుల పురోగతిని పరిశీలించారు. ప్రభుత్వ పాఠశాలను సందర్శించి విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. భోజనం నాణ్యతను పరిశీలించి, విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలపై వివరాలు తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పల్లె లక్ష్మి రవి పాల్గొన్నారు.