5 రోజుల్లో రూ.663 కోట్ల వసూళ్లు!
NEWS Nov 10,2026 12:39 pm
‘రామాయణం పార్ట్–1’ చిత్రం బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. 5 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.663.90 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. సోమవారం ఒక్కరోజే భారత్లో రూ.107.50 కోట్ల నెట్ కలెక్షన్లు రాబట్టి, అత్యధిక సోమవారం వసూళ్ల రికార్డు సృష్టించింది. దేశీయంగా రూ.413.90 కోట్ల గ్రాస్, విదేశాల్లో రూ.250 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. రూ.4 వేల కోట్ల భారీ బడ్జెట్తో తెరకెక్కిన ఈ చిత్రం 2026లో అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రాల్లో మూడో స్థానంలో నిలిచింది.