రోబో కుక్కకు వాకింగ్.. గంటకు ₹2000
NEWS Nov 03,2026 02:09 pm
ఏఐ టెక్నాలజీతో ఉద్యోగాల స్వరూపం మారుతోంది. అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కోకు చెందిన ‘డైమెన్షనల్’ స్టార్టప్ సంస్థ రోబో కుక్కలను వీధుల్లో వాకింగ్‌కు తీసుకెళ్లేందుకు ఉద్యోగులను నియమిస్తోంది. ఎంపికైన వారు రోజుకు 4–6 గంటల పాటు రోబో కుక్కలను నడిపించాల్సి ఉంటుంది. ఇందుకోసం గంటకు 20 డాలర్లు (సుమారు రూ.2,000) వేతనం చెల్లించనున్నారు. సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతున్న నేపథ్యంలో రోబోల నిర్వహణ కోసం కొత్త తరహా ఉద్యోగాలు అందుబాటులోకి రావడం ఆసక్తికరంగా మారింది.