మల్యాల మండల కేంద్రంలోని చెరువు ప్రస్తుతం పక్షుల కిలకిలరావాలతో సందడిగా మారింది. చెరువు మధ్యలో ఉన్న చెట్టుపై గిజిగాడు పిట్టలు అల్లిన గూళ్లు, వాటిపై నీటి కాకులు సేదతీరుతున్న దృశ్యం ప్రకృతి ప్రేమికులను ఆకట్టుకుంటోంది. వలస పక్షులతో పాటు స్థానిక పక్షులకు మల్యాల చెరువు సురక్షిత ఆవాసంగా మారింది. నీటిలో ఉన్న చెట్టుపై దాదాపు 30కి పైగా గిజిగాని గూళ్లు వేలాడుతూ, పైన నల్లని నీటి కాకులు వాలిన దృశ్యం చూపరులను కనువిందు చేస్తోంది.