గిద్దలూరు: పట్టణంలో తూనికల అధికారులు పలు దుకాణాలపై తనిఖీలు నిర్వహించారు. ఎరువుల దుకాణాలు, ఎలక్ట్రానిక్ షాపులతో పాటు మొత్తం ఆరు దుకాణాల్లో తనిఖీలు చేపట్టి, నిబంధనల ఉల్లంఘనలకు సంబంధించి కేసులు నమోదు చేశారు. అన్ని దుకాణాలకు కలిపి రూ.20 వేల జరిమానా విధించినట్లు అధికారి జావిద్ అహ్మద్ తెలిపారు.