ఎంపీపీ పీఠంపై రంగనాయకుల పేరు
NEWS Oct 27,2026 11:17 pm
గిద్దలూరు: మండలంలో ఎంపీటీసీ స్థానాల్లో టీడీపీ ఆధిక్యం నేపథ్యంలో మండల పరిషత్ అధ్యక్ష పదవిపై ఆసక్తి పెరిగింది. ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారి ముత్యాలపాటి రంగనాయకుల పేరు ఎంపీపీ అభ్యర్థిగా వినిపిస్తోంది. పార్టీ మద్దతుతో ఆయన మండల పరిషత్ అధ్యక్ష పీఠాన్ని అధిరోహించే అవకాశం ఉందనే చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది. గిద్దలూరు మండలంలో 13 ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవం కావడంతో టీడీపీ ఆధిక్యం ప్రదర్శించిందని స్థానికంగా చర్చ జరుగుతోంది. తిమ్మాపురం ఎంపీటీసీ ఎన్నిక, అనంతరం జరగనున్న ఎంపీపీ ఎన్నికపై ఉత్కంఠ నెలకొంది.