మృతురాలి కుటుంబానికి ఆర్థిక సాయం
NEWS Oct 27,2026 11:13 pm
ఎల్లారెడ్డిః నాగిరెడ్డిపేట మండలం జలాల్‌పూర్ గ్రామానికి చెందిన తలారి రాములు, పోచయ్యల తల్లి సత్యవ్వ అనారోగ్యంతో మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న టీఆర్‌ఎస్ పార్టీ ఎల్లారెడ్డి నియోజకవర్గ సీనియర్ నాయకుడు ఇ. ప్రభాకర్ వారి కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి, అండగా ఉంటానని భరోసా కల్పించారు. కుటుంబానికి ఆర్థిక చేయూతగా రూ.5 వేల సాయం అందించారు. ఈ కార్యక్రమంలో గ్రామ అధ్యక్షుడు మాణిక్యం, కె. విజయ్, ఎం. సతీష్, సీహెచ్ ప్రవీణ్, సీహెచ్ సిద్ధూ, బి. రవి, ఏ. కుమార్, బి. గోపాల్, ఎన్. ఎల్లయ్య, జె. శ్రీనివాస్ పాల్గొన్నారు.